calender_icon.png 23 December, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి

23-12-2025 02:11:38 AM

రంగారెడ్డి, డిసెంబర్ 22( విజయక్రాంతి): ప్రజావాణిలో సమర్పించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి( రెవెన్యూ )  సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమవేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు తెలపడానికి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను జిల్లా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి, ( రెవెన్యూ ) డీఆర్‌ఓ సంగీతతో కలిసి స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత జిల్లా అధికారులు సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం (29) ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలంతా ప్రజావాణి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజావాణి కి  రెవెన్యూ శాఖ 06, ఇతర శాఖలకు  23, మొత్తం 29  దరఖస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.