calender_icon.png 23 December, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యాటక అద్భుతాలను పరిచయం చేయండి

23-12-2025 02:35:29 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే పిలుపు

జనవరి 5వ తేదీలోగా ఎంట్రీలు పంపించాలి

‘100 వీకెండ్ వండర్స్’ 

గోడ ప్రతుల ఆవిష్కరణ

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 22(విజయక్రాంతి): జిల్లాలో దాగి ఉన్న పర్యాటక అందాలను ఫొటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భారీ నగదు బహుమతులు అందించ డం జరుగుతుందని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా పర్యా టక శాఖ అధికారి అష్ఫాక్ అహ్మద్‌తో కలిసి ‘100 వీకెండ్ వండర్స్’ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలు వారాంతాలలో వెళ్లేందుకు కొత్త ప్రదేశాలను అన్వేషిస్తుంటారని, ఈ నేపథ్యంలోనే 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఒక పోటీని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

ప్రజలకు తెలియని జలపా తాలు, పురాతన దేవాలయాలు, ట్రెక్కింగ్ పాయింట్లు వంటి 100 కొత్త గమ్యస్థానాలను గుర్తించి, వాటి వివరాలతో ఒక కాఫీ టేబుల్ బుక్ రూపొందించడమే ఈ పోటీ లక్ష్యమని తెలిపారు. నేచర్, వైల్ లైఫ్, ఆర్ట్ అండ్ కల్చర్, హెరిటేజ్, వాటర్ బాడీస్, వంటకాలు, ఫామ్ స్టేస్, రిసారట్స్, స్పిరిచువల్, అడ్వెంచర్ వంటి 10 విభాగాల్లో ఎంట్రీలు పంపవచ్చని తెలిపారు. ఎంచుకున్న ప్రదేశానికి సంబంధించి 3 మంచి ఫొటోలు, 60 సెకన్ల నిడివి గల వీడి యో, ఆ ప్రదేశానికి రవాణా, బస, బడ్జెట్ వివరాలతో కూడిన 100 పదాల సమాచారాన్ని పోస్టర్ లో పేర్కొన్న గూగుల్ ఫామ్ / సోషల్ మీడియా ఎకౌంట్లకు ట్యాగ్ చేయవచ్చని తెలిపారు. 

ఉత్తమ ఎంట్రీలకు మొదటి బహుమతి గా 50 వేల రూపాయలు, ద్వితీయ బహుమతిగా 30 వేల రూపాయలు, తృతీయ బహు మతిగా 20వేల రూపాయలు అందించడం జరుగుతుందని, కన్సోలేషన్ బహుమతులుగా హరిత హోటల్స్ లో ఉచిత బస కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జనవరి 5వ తేదీ లోగా ఎంట్రీలు పంపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.