calender_icon.png 23 December, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఫాక్స్‌కాన్’లో భారీగా నియామకాలు

23-12-2025 02:07:58 AM

80 శాతం ఉద్యోగాలు మహిళలకే!

కర్ణాటక దేవనహళ్లి యూనిట్‌లో పోస్టింగ్‌లు

బెంగళూరు, డిసెంబర్ 22: కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన ఫాక్స్‌కాన్ ఐఫోన్ కంపెనీలో కేవలం 8-9 నెలల్లోనే సుమారు 30 వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే వీరిలో ఎక్కువమంది మహిళలు ఉన్నట్లు ‘ఎకనామిక్ టైమ్స్’ కథనం వెల్లడించింది. సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ దేశంలోనే రెండో అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లీ యూనిట్ గా ఉంది.

ఈ యూనిట్‌లో మొదట్లో ఐఫోన్ 16 మోడల్ ఉత్పత్తి జరుగుతుండగా, ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ కూడా తయారీకి వచ్చాయి. ఉత్పత్తిలోని ఐఫోన్లలో 80 శాతం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.వచ్చే ఏడాది నాటికి సిబ్బందిని 50 వేల వరకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఫాక్స్‌కాన్ తమిళనాడు ఐఫోన్ ప్లాంట్ తర్వాత ఇది రెండో పెద్ద ప్రాజెక్ట్. తమిళనాడులోని ఫ్యాక్టరీలో 41 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలోనూ అత్యధికంగా మహిళలే ఉన్నారు. ఫాక్స్‌కాన్ డిజైన్, టెక్ విభాగాల్లో మహిళలను అగ్రగాములుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా నియా మకాలు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా ఫాక్స్‌కాన్ ఇప్పటికే మినీ టౌన్‌షిప్ స్థాయి లో సౌకర్యాలు అందిస్తూ, ఉద్యోగుల కోసం ఇళ్లు, వైద్య, విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేసింది.