23-12-2025 02:42:46 AM
నిర్మల్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని జీఎన్‌ఆర్ కాలనీలో సోమవారం జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెం ట్ అథారిటీ- ఎన్‌ఎండిఏ), రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నేతృత్వంలో విపత్తు నిర్వహణ మాక్ డ్రీల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ కలెక్టర్ అభిలాష అభినవ్ పర్యవేక్షణలో జరిగింది. మాక్ డ్రిల్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు.
భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు, ప్రజల భాగస్వామ్యం, అధికారుల మధ్య సమన్వయం కొరకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహా లపై, వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వ యం, ప్రజల భాగస్వామ్యం కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారులు ప్రభాకర్, శివాజీ, వివిధ శాఖల జిల్లా అధికారులు జీవరత్నం, నరసింహా రెడ్డి, రాజేందర్, శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దార్లు రాజు, ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం, ఇతర అధికారులు పాల్గొన్నారు.