17-11-2025 12:44:05 AM
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు దోసపాటి వెంకటేశ్వరరావు
మణుగూరు, నవంబర్ 16 (విజయక్రాంతి) :ఆర్యవైశ్యులు అందరూ ఐక్యతను ప్రదర్శించి కులబలాన్ని పెంచాలని, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దోసపాటి వెంకటేశ్వరరావు పిలుపు నిచ్చారు. ఆదివారం వెన్నెల జలపాతం వద్ద నిర్వ హించిన కార్తీకమాస వన సమారాధన కార్యక్రమంలో ఆయన జిల్లా ఆర్య వైశ్య అధ్యక్షుడు ధారా రమేష్, పెండ్యాల రోజా లక్ష్మి తో కలిసి పాల్గోన్నారు.
ఈసందర్భం గా ఆయన మాట్లాడుతూ, ఆర్య వైశ్య సమాజం సత్యనిష్ఠ, సేవాభావం, వ్యాపార నైపుణ్యం, సామాజిక సేవలో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఆర్యవైశ్యులు అందరు పరస్పర సహకారంతో మరింత బలమైన ఆర్థిక,సామాజిక స్థితి సాధించాలని ఆకాంక్షిస్తున్నా మని తెలిపారు. ఈ సందర్భంగా పలువురిని సన్మానించి వారి సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు దారా రమేష్, నగేశ్ కుమార్,మల్లిఖార్జునరావు, దోసపాటి నాగేశ్వరరావు, కత్తి రాము, రమేష్, నరసింహారావు, విశ్వనాథ గుప్త, దోసపాటి స్వర్ణ, స్వరాజ్యరావు, సందీప్,వెంకన్న, రాజేంద్రప్రసాద్,సుబ్రహ్మణ్యం, వందనపు వాసు,బ్రహ్మయ్య, శ్యామ్, అంజలి,ఇందుమతి,బాను, పాల్గొన్నారు.