calender_icon.png 25 November, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశా జ్యోతి బండి సంజయ్..

25-11-2025 12:36:38 AM

- సైకిళ్లు పంపిణీలో బీజేపీ నాయకులు 

- బెజ్జంకి ని కరీంనగర్లో కలిపేవరకు ఉద్యమం చేస్తాం.

బెజ్జంకి నవంబర్ 24; బడుగు బలహీనవర్గాల ఆశా జ్యోతి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అని రాష్ట నాయకులు కరివేద మహిపాల్ రెడ్డి లు అన్నారు .సోమవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోనీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో సుమారు 34 మంది పదవ తరగతి విద్యార్థులకు మోడీ కానుకగా బిజెపి నాయకులు, కరివేద మైపాల్ రెడ్డి , సొల్లు అజయ్ వర్మ, సంఘ రవి,లు ఎంఈఓ మహంతి లక్ష్మి తో కలిసి సైకిళ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మైపాల్ రెడ్డి, మాట్లాడుతూ కేంద్ర హోమ్ సహాయ మంత్రి బండి సంజయ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ఆయన మన ఎంపీగా ఉండడం అదృష్టం అని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే అధిక శాతం ఉంటారని , స్కూల్ కి వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాల్లేక,ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని, విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని తెలిపారు .

పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు మొత్తం 20 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేయడం జరుగుతుందని,మరి కొద్ది నెలలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామని సంతోషం వ్యక్తం చేశారు.పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి చదివే విద్యార్థుల ఎగ్జామ్స్ ఫీజ్ చెల్లించటం జరిగిందని, పదవ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారికి మొదటి బహుమతిగా 10000 రెండో బహుమతిగా 5000 రూపాయలు అందిస్తామని తెలిపారు .

- కరీంనగర్లో కలిపేవరకు ఉద్యమం చేస్తాం : - సొల్లు అజయ్ వర్మ

బెజ్జింకి మండలాన్ని ఎన్నికల సమయంలో కరీంనగర్ జిల్లాలో కలుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుండ్లపల్లె జరిగిన సభలో వారు మాట ఇచ్చి మాట తప్పడం జరిగిందని . బెజ్జంకిని కరీంనగర్ లో కలపని పక్షంలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మండలాన్ని కరీంనగర్లో కలిపేవరకు ఉద్యమం చేస్తామని అజయ్ వర్మ అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు బుర్ర మల్లేశం గౌడ్ ,రామచంద్రం, దొమ్మాటి రాములు ,యువ మోర్చా మండల అధ్యక్షులు తూముల రమేష్ ,సునీత గౌడ్, లావణ్య , సాయిలు ,శ్రీనివాస్ ,శీలం వెంకటేశం, రవికుమార్,  అంజిరెడ్డి ,  రాజేశం గౌడ్, యువజన నాయకులు శానకొండ రజనీకాంత్ విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.