calender_icon.png 25 November, 2025 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా నుంచి కుంటకట్టను కాపాడిన అధికారులు

25-11-2025 12:34:59 AM

కబ్జా వెనక ప్రజాప్రతినిధి హస్తం ?

కేసు నమోదు చేయాలని ఇరిగేషన్ ఫిర్యాదు

తూప్రాన్, నవంబర్ 24 :కబ్జాదారుల చెర నుండి కుంటకట్టను ఇరిగేషన్ అధికారులు కాపాడారు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని అవుసులోని కుంట ప్రాంతంలో ఉన్న కుంటకట్టను గత నాలుగు రోజులుగా ఆక్రమార్కులు రాత్రివేళల్లో అక్రమంగా తొలగిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న 30 అడుగుల ప్రధాన రోడ్డుకు రియల్టర్లు సులభంగా మార్గం కల్పించేందుకు స్థానికంగా ప్రభావం ఉన్న ఒక ప్రముఖ మాజీ మున్సిపల్ ప్రజా ప్రతినిధి అండదండలతో కబ్జాకు పాల్పడినట్లు తేలింది.

రాత్రికి రాత్రే కుంటకట్టను పూర్తిగా ధ్వంసం చేసిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.  తూప్రాన్ తహసీల్దార్తో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు సోమవారం ఉదయం కుంటకట్ట స్థలాన్ని పరిశీలించారు. తొలగించిన కుంటకట్టను, అక్రమంగా జరిగిన తవ్వకాలను వివరంగా పరిశీలించారు. అక్రమార్కులు ఎవరైనా సరే ఉపేక్షించడం లేదని ఇరిగేషన్ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఒక జె.సి.బి ఆధారంగా ఈ ఘటనకు సంబంధించి ఒక మాజీ మున్సిపల్ ప్రజా ప్రతినిధి పేరు వెలుగులోకి రావడంతో, వెంటనే చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులు తూప్రాన్ సీఐ రంగ కృష్ణ, ఎస్త్స్ర శివానందం లకు దరఖాస్తు సమర్పిస్తూ కేసు నమోదు చేయాలని కోరారు. స్థానికుల ఆరోపణల ప్రకారం, కుంటకట్టను ధ్వంసం చేయడం వల్ల అవుసోని ప్రాంతంలో నీటి నిల్వలను పూర్తిగా నాశనం చేసినట్లే అవుతుందని, పర్యావరణానికి నష్టం వాటిల్లిందని అంటున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్, ఏఈ అనూరాధ పాల్గొన్నారు.