calender_icon.png 25 November, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి

25-11-2025 12:34:50 AM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్, నవంబర్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వం కనిపిస్తున్న సంక్షేమలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సామాజిక  భద్రతా పథకాల పై అవగాహన సదస్సులు గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వారి సంక్షేమం కోసం క్రింది సామాజిక భద్రతా పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రమాద మరణం కు రూ 10 లక్షలు, సహజ మరణం కు రూ 2 లక్షలు, వైకల్యకు రూ 5 లక్షల వరకు పెళ్లి కానుక కు రూ 30 వేలు, ప్రసూతి కు రూ 30 వేలు, హాస్పిటలైజేషన్ రిలీఫ్  రోజుకు రూ 300 నమోదు లేని కార్మికుల మరణాలకు ప్రత్యేక సహాయంకు రూ 50 వేలను అందించడం జరిగిందన్నారు. 

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సామాజిక  భద్రతా పథకాల పై అవగాహన సదస్సులు ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉప కార్మిక కమిషనర్ ఎన్. చంద్ర శేఖర్ గౌడ్. అదనపు కలెక్టర్(రెవెన్యూ) మధు సూదన్ నాయక్,  సహాయ కార్మిక కమీషనర్ ఎండీ.  అల్తాఫ్, సిబ్బంది పాల్గొన్నారు.