25-12-2025 02:14:01 AM
ఒకే క్యాంపస్‌లో పాఠశాల, ప్రీ మెట్రిక్ హాస్టల్ నిర్వహణ..
పాఠశాలలో అడుగడుగునా నిర్లక్ష్యం..
బోథ్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): బోథ్‌లోని ప్రభుత్వ ఆశ్రమ బాలుర ప్రైమరీ స్కూల్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సరైన విద్య బోధన లేక, నాణ్యమైన భోజనం అందించక విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయి. ఈ పాఠశాల లో మొత్తం 202 మంది విద్యార్థులునున్నారు. ఇందులో 3,4,5 తరగతులు ఉండగా వారికి ప్రధానోపాధ్యాయుడు ఒక్కడే ఉన్న, రెగ్యులర్ ఉపా ధ్యాయుడు లేరు.
మూడు తరగతులకు కలిపి కేవలం ఒక్క సీఆర్టీ మాత్రమే విధులు నిర్వహిస్తున్నాడు. మూడు తరగతులు కలిపి అన్ని సబ్జెక్టులకుగాను ఒక్క సీఆర్టీ మాత్రమే ఎలా విధులు నిర్వహిస్తాడు, ఎలా చదువు చెపుతా డు అనేది ఆ ఉన్నత అధికారులకే తెలియాలి. వాస్తవానికి పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడు, ముగ్గురు టీచర్లు, ఒక వాడెన్ ఉండా లి. కానీ ఇక్కడ అదేమీ కనిపించడం లేదు.
గత విద్యా సంవత్సరం ఇద్దరు సీఆర్టీ లు ఉండగా వేరువేరు కారణాలతో ఒక సీఆర్టీని బదిలీ చేశా రు. ఆయన స్థానంలో మరొక సీఆర్టీనిగాని ఉపాధ్యాయునిగాని నియమించడం మర్చిపోయారు. పలుమార్లు ఉన్నతాధికారులకు ఈ సమస్య గురించి విన్నవించిన పట్టించుకోవడంలేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఉన్న పాఠశాల పరిస్థితి ఇలా ఉంటే మారుమూల గిరిజన గ్రామాలలో ఉన్న పాఠశాలల పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ట్రైబల్ విద్యార్థుల పట్ల అధికారులు ఎందుకింత చిన్నచూపు చూస్తున్నారని విద్యార్థుల పేరెంట్స్ వాపోతున్నారు.
ఓకే క్యాంపస్‌లో పాఠశాల, ప్రీ మెట్రిక్ హాస్టల్ నిర్వహణ...
పాఠశాల పరిస్థితి ఇలా ఉంటే ఇదే క్యాంప స్‌లో ఇతర పాఠశాలలలో చదువుకునే 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు ప్రీ మెట్రిక్ హాస్టల్ ను కూడా నిర్వహిస్తున్నారు. వీరి సంరక్షణకుగాను ఒక వార్డెన్ మాత్రమే ఉన్నాడు. 202 మంది విద్యార్థులు ఉన్న, వీరి ఆలనా పాలన చూసుకోక పోవడంతో విద్యార్థులు పలుమార్లు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు.
అస్తవ్యస్తంగా హాస్టల్ నిర్వహణ
హాస్టల్లో విద్యార్థులకు సరైన భోజ నం అందించడం లేదని, భోజనములో పురుగులు వస్తున్నాయని పలుమార్లు విద్యార్థులు హాస్టల్ ముందర ధర్నా నిర్వహించారు. ఉన్నతాధికారులు సందర్శిం చి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ మార్పు లేదు. సంబందిత అది కారులు ఏ.టి.డబ్ల్యూ.ఓ, డి.డి లు పాఠశాలను, హాస్టల్‌ను సందర్శించినప్పటికీ విద్యార్థు లు ఎదుర్కొంటున్న సమస్యల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య ను పెంచాలని, అలాగే ప్రీ మెట్రిక్ హాస్ట ల్ విద్యార్థులకు మెనూ ప్రకారం సరైన భోజనం అందించాలని విద్యార్థుల సంరక్షణ చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.