calender_icon.png 25 December, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహానగరం.. ఇక 12 జోన్లు

25-12-2025 02:11:28 AM

  1. జీహెచ్‌ఎంసీ పరిపాలనలో భారీ మార్పులు
  2.   ౩00 వార్డులకు తగ్గట్టుగా జోన్లు, సర్కిళ్ల పునర్విభజన
  3. ప్రస్తుతమున్న 6 జోన్ల స్థానంలో 12 జోన్ల ఏర్పాటుకు ప్రతిపాదన
  4.   57 నుంచి 60కి పెరగనున్న సర్కిళ్ల సంఖ్య

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 24 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని తెలుస్తోంది. నగర విస్తరణ, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పరిపాలనను మరింత వికేంద్రీకరించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిని మొత్తం 300 మున్సిపల్ వార్డులుగా డీలిమిటేషన్ చేసే ప్రక్రియ కొలిక్కిరాగా.. ఇప్పుడు జోన్లు, సర్కి ళ్ల పునర్విభజనపై అధికారుల దృష్టి మళ్లిం ది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో కలిసి తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు విశ్వస నీయ సమాచారం.

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 6 జోన్లు, 57 సర్కిళ్లు ఉన్నా యి. అయితే ఔటర్ రింగ్ రోడ్డు వరకు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సంఖ్యను భారీగా పెంచాలని యోచిస్తున్నారు.పరిపాలన సౌలభ్యం కోసం జోన్ల సంఖ్యను 6 నుం చి ఏకంగా 12కు పెంచాలి. అలాగే సర్కిళ్ల సంఖ్యను 60కి చేర్చాలి.దీనికి సమాంతరంగా.. 10 జోన్లు, 60 సర్కిళ్లుగా విభజిం చాలన్న మరో ప్రతిపాదనను కూడా కమిషనర్ పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి జోన్ పరిధిలోకి కనీసం 5 సర్కిళ్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ విషయంపై కమిషనర్ ప్రధా న కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, సం బంధిత విభాగాల అదనపు కమిషనర్లతో వరుసగా వర్కవుట్ చేస్తున్నారు.జోన్లు, సర్కిళ్లను ఏర్పాటు చేసేటప్పుడు భౌగోళికంగా ఎలాంటి గందరగోళం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పౌర సేవల నిర్వహణలో కీలకమైన శానిటేషన్, ఎమర్జెన్సీ విభాగాల అధికారులను పిలిపించి, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు రాకుండా వారి అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు.

ఒకే కార్పొరేషన్ గా కొనసాగింపు..గత కొంతకాలంగా జీహెచ్‌ఎంసీని రెండు లేదా మూడు కార్పొరేషన్లు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. విలీ నం తర్వాత నగరం ఎంత విస్తరించినా, 300 వార్డులు ఏర్పడినా.. జీహెచ్‌ఎంసీని ఒకే కార్పొరేషన్‌గా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం పాలకమండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉండ టంతో, ఇప్పుడే ముక్కలు చేయడం సాంకేతికంగా కుదరదని అధికారులు భావిస్తున్నా రు. ఒకవేళ ప్రభుత్వం కార్పొరేషన్లను విభజించాలనుకున్నా, అది ఫిబ్రవరి 10 తర్వాతే సాధ్యమయ్యే అవకాశం ఉంది.ముంబై మోడల్.. జోన్లకే పవర్స్..ఒకవేళ జీహెచ్‌ఎంసీని విభజించకుండా ఒక్కటిగానే ఉంచితే.. పరిపాలనను మాత్రం బృహత్ ముంబై కార్పొరేషన్ తరహాలో మార్చాలని యోచిస్తున్నారు.

అభివృద్ధి పనులు, పరిపాలన అనుమతులు, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారాలను జోనల్ స్థాయిలోనే కల్పించనున్నారు. హెడ్ ఆఫీస్‌కు పని తగ్గించి, కేవలం పర్యవేక్షణ బాధ్యతలు మా త్రమే ఉంచేలా, జోన్లనే పవర్ సెంటర్లుగా మార్చేలా కమిషనర్ కర్ణన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం.