calender_icon.png 12 October, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా ఆసిఫాబాద్ డీసీసీ ఎన్నిక

12-10-2025 01:03:25 AM

  1. సబ్బండ వర్గాల అభిప్రాయం సేకరిస్తాం
  2. ఏఐసీసీ ప్రతినిధి నరేష్‌కుమార్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్ష ఎన్నికను పారదర్శకంగా నిర్వహిస్తామని ఎన్నికల పరిశీలకుడు, ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్‌కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాల యం వద్ద జిల్లా అధ్యక్ష ఎన్నిక నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశానికి  పీసీసీ పరిశీలకులు శ్రీనివాస్, అనిల్‌కుమార్, జ్యోతి, పీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణక్క, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సుక్కు, ఆసిఫా బాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్‌తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భం గా ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎన్నికకు అధిష్టానం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించా రు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్ష ఎన్నిక నిర్మాణపై వచ్చినట్లు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ గెస్ట్ హౌస్‌లో ఉదయం 10.30 గంటలకు డీసీసీ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు సిర్పూర్ నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 13న జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. 14న సాధారణ ప్రజలతో పాటు మేధావుల ద్వారా అభిప్రాయా న్ని సేకరిస్తామన్నారు. 19న పోటీలో ఉన్న అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమం ఉం టుందని వివరించారు.

జిల్లా అధ్యక్ష ఎంపికపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని, పైరవీలకు తావు లేకుండా ఎన్నిక కార్యక్రమం చేపడుతామని స్పష్టం చేశారు. రెండు జిల్లాలలో పర్య టించి నివేదికను అధిష్టానానికి అందించనున్నట్టు తెలిపారు. అధ్యక్షుల ప్రకటన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకే ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ, మహిళా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే దిశగా కృషి చేస్తుందన్నారు.

పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి అం దరి అభిప్రాయాలను సేకరించడంతోపాటు అభ్యంతరాలను  పరిశీలిస్తామని చెప్పారు. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న వారిపై నాకు నేరుగా సలహాలు సూచనలు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, మాజీ ఎంపీపీ బాలేశ్వ ర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాధవేని మల్లేష్, నాయకులు పాల్గొన్నారు.