calender_icon.png 12 October, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15న బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ప్రదానం

12-10-2025 01:34:37 AM

ముషీరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): భారతదేశ 11వ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం 94వ జయంతిని పురస్కరించుకుని డా.కలామ్ బెస్ట్ టీచర్స్ అవారడ్స్ -25 కార్యక్రమాన్ని తెలంగాణ రికగనైజ్డ్ స్కూల్స్ మానేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా)తో భాగస్వామ్యంతో అక్టోబర్ 15న ఉదయం 10 గంటలకు రవీంద్ర భారతీలో ఘనంగా నిర్వహించనున్నట్లు లీడ్ ఇండి యా ఫౌండేషన్ వ్యస్థాపకుడు ప్రొ.ఎన్.బాలకృష్ణ సుధర్శన్ ఆచార్య  శనివారం ఒక ప్రక టనలో తెలిపారు.

రవీంద్ర భారతిలో జరి గే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డా.ఈ.నవీన్ నికోలస్ ఐఏఎస్, గౌరవ అతిథులుగా డిఆర్ డివో మాజీ చైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ హాజరావుతారని తెలిపారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను గుర్తించి డా.కలామ్ బెస్ట్ టీచర్స్ అవారడ్స్ -25 ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేస్తారని తెలిపారు. దేశ అభివృద్ధి ఉపాధ్యాయుల చేత ప్రారంభమవుతుందని, ఆ దిశగా శ్రమిస్తున్న గౌరవించడం ఈ అవార్డు లక్ష్యం అన్నారు.