15-07-2025 01:16:36 AM
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ఆగస్టు నెలలో శాసనసభా, శాసనమండలి సమావేశాలు జరిగే అవకాశం ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలి పారు. పాత అసెంబ్లీ భవనంలోనే మండలి సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని తెలిపారు. మండలి భవనం పునర్నిర్మాణ పనులపై సోమవారం ఆర్ అండ్‌బీ, ఆగాఖాన్ సంస్థ, ఇతర అధికారులతో సుఖేందర్‌రెడ్డి సమీక్ష నిర ్వహించారు.
మండలి భవనం పునర్నిర్మానం పనులు విషయంలో సీఎం ఆరా తీశారని, వచ్చే సమావేశాలు పాతభవనంలోనే నిర్వహించా లని ఆదేశించారన్నారు. ఆగస్టు 15లోగా ప నులన్నీ పూర్తి చేయాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, సీఎం సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు, అసెం బ్లీ కార్యదర్శి డా.నరసింహచార్యులు, ఈఎన్‌సీ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.