calender_icon.png 13 September, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువు... ఏడిపిస్తోంది..!

13-09-2025 01:14:23 AM

- ఏజెన్సీలో కోరలు చాస్తున్న యూరియా దందా 

- అవసరమే ఆసరా.. అధిక ధరలకు విక్రయాలు 

- అన్నదాతలను లూటీ చేస్తున్న అక్రమార్కులు 

- సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు

- యూరియా కోసం రైతుల ఎదురు చూపులు 

- పర్యవేక్షణ, పట్టింపు లేని అధికారులు 

మణుగూరు, సెప్టెంబర్ 12, (విజయక్రాంతి) : ఏజెన్సీలో రైతన్నకి యూరియా కొ రత నిద్రపట్ట నివ్వడం లేదు. వ్యవసాయ పనులను పక్కనపెట్టి గంటల తరబడి ఎరువుల దుకాణాల ముందు, మన గ్రోమోర్ సెంటర్లు, రైతుసేవా కేంద్రాలు, డీసీఎంఎస్, ప్రాథమిక సహకార సంఘాలు ఇలా అన్ని చోట్లా అన్నదాతలుక్యూలో నిల్చోవడం ని త్యకృత్యగా మారింది. రైతుల అవసరాన్ని తమ అక్రమాలకు అవకాశంగా మార్చుకొని నియోజకవర్గం లో కొందరు ఎరువుల వ్యాపారులు సిండికేట్ గా మారి,యూరి యా బ్లాక్ దందాకు తెరతీశారు. అధిక ధరలతో అన్నదాతను నిలువునా దోసుకుంటు న్నారు. రైతుల ఇక్కట్లపై విజయక్రాంతి అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఎరువుల కోసం ఎదురుచూపులు..

నియోజకవర్గంలోని అశ్వాపురం, బూర్గంపాడు, పినపాక, కరకగూడెం, మణుగూరు మండలా లలో వరితోపాటు, ఇతర వాణిజ్య పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా ఇక్కడి అన్నదాతలు వరి సాగుకే మొగ్గుచూపుతారు. చెరు వులు, బోరు బావులు, కుంట లు కింద సుమారు గా 10వేల ఎకరాలకు పైగా ఇప్పటికే నాట్లు పూర్తి చేసిన రైతులు, పొలాల్లో మొదటి, రెండో కోటాగా కాంప్లెక్స్ ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వారిని యూరియా కొరత కన్నీరు పెట్టేస్తుం ది. మరో వైపు ఎరువుల దుకాణ దారులు సిండికేట్ గా ఏర్పడి అధిక ధరలతో యూరి యా విక్రయాలు జరుపుతున్నారు.

పంటను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులకు వ్యాపారుల ధర లు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. యూరి యా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారులు ఇస్టా రాజ్యంగా ధరలు పెంచి కర్షకులను లూటీ చేస్తున్నారు. బస్తా యూ రియా ధర రూ.266 ఉండగా ప్రైవేటు వ్యా పారులు రూ. 350 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు యథేచ్చగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నించిన రైతులకు యూరియా విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు. వ్యాపారుల దెబ్బకు ఎరువుల ధర లుమండుతున్నాయి. సహకార, కేంద్రా ల్లో యూరియా నిల్వలు నిండు కుండడం, మరోవైపు వ్యాపారులు కృ త్రిమ కొరత పాటు అధిక ధరలతో సొమ్ము చేసుకుంటున్నారు.

బస్తా దొరకడం గగనమే..

నియోజకవర్గంలో రైతాంగానికి ఒక బస్తా యూరియా దొరకడం గగనంగా మారింది. ఒక బస్తా కావాలంటే ఇతర సరుకులను కూ డా కొనాలనే షరతులు, క్యాష్ అండ్ క్యారీ వంటి నిబంధనల తో వ్యాపారులు రైతుల ను మరింత పీడిస్తున్నారు. యూరియా కొర త ఫర్టిలైజర్ షాప్ల యాజమాన్యాలకి డబ్బు వరదను పారిస్తుంది.

పరపతి ఉన్న వారికే ప్రాధాన్యం..

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా లు (పీఏసీఎస్) కూడా రైతులకు సమర్థంగాయూరియానుఅందించడంలో విఫలమ వుతున్నాయి. ఈ సంఘాల్లో కూడా పరపతి ఉన్న రైతులకే యూరియా లభిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ముఖ్యం గా పేద, సన్న కారు రైతులు, పోడు రైతులు ఈ సహకార సంఘాల నుంచి ఏమాత్రం ల బ్ధి పొంద లేకపోతున్నారు. వారికి ప్రైవేటు డీలర్ల దుకాణాలే దిక్కుగా మారాయి. పీఏసీఎస్ ల లో ఒక రైతుకు కేవలం ఒకటి, రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడంతో అది వారి అవసరాలకు ఏ మా త్రం సరి పోవడం లే దు. దీంతో వారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ దుకాణాలను ఆశ్రయించి అధిక ధరలైనా సరే యూరియా కొనుగోలు చేస్తూ ఆరి కంగా ఇబ్బందులు పడుతున్నారు.

పర్యవేక్షణ పట్టని యంత్రాంగం..

ఎరువుల విక్రయాలపై మార్క్ఫెడ్, సొసై టీ అధికారులు, ప్రైవేటు డీలర్లపై అధికారుల పర్యవేక్షణ, అజ మాయిషీ లేకపోవడంతోనే వ్యాపారులు ఇష్టారాజ్యంగా బ్లాక్ దందా చే స్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. కేంద్రం నుంచి సరిపడా యూరియా తెప్పించ డంలోనూ ప్రభుత్వ పెద్దలు విఫ లం చెందారని, అర కోరగా వచ్చినయూరియాను సక్రమంగా పంపిణీ చేయడంలో క్షేత్రస్థాయి అధికారులు విఫల మయ్యారని రైతు సంఘాల నేతలు ఆరోపణలు గుప్పిస్తు న్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ఏజెన్సీ లో రై తులకు సరైన సమయంలో యూరియా ను అందుబాటులోకి తీసుకురాకపోతే రైతులకు ఈ కష్టాలు మరింత ఎక్కువవుతున్నయి. అ ధికారులు బ్లాక్ మార్కెట్ దందాపై చర్యలు తీసుకోకపోతే అక్రమార్కుల అంతులేని దో పిడీ కొనసాగుతూనే ఉంటుంది.ఈ విషయ మై మండల వ్యవసాయ అధికారి కొమరం లక్ష్మణరావు ను వివరణ కోరగా ప్రైవేటు దు కాణాలలో యూరియా అమ్మకాలు జరగ టం లేదని, వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందిస్తున్నామన్నారు. ఎవరైనా అధిక ధరలకు అమ్మినట్లు ఫిర్యాదులు వస్తే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు.