26-01-2026 03:14:27 AM
ముకరంపుర, జనవరి 25 (విజయ క్రాంతి): నగరంలోని హనుమాన్ నగర్ బ్లూ బెల్స్ పాఠశాలలో ఆదివారం యూలో టెక్కీ, రోబోటిక్స్, స్కిల్ దర్బార్ ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ జంగా సునీత మనోహర్ రెడ్డి దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా క్వాలిటీ కోఆర్డినేటర్ కె అశోక్ రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రీజినల్ మేనేజర్ ఫిరోజ్ ఖాన్, యు లిప్స్ రీజినల్ హెడ్ సుప్రియా, కుడాలి శ్రీనివాస్, బి సురేందర్ రెడ్డి, ప్రకాష్, పద్మజ, అలెగ్జాండర్, షోయబ్, విజయ్, సుప్రియలు హాజరై ప్రదర్శనలను తిలకించారు.
రోబోటిక్స్ విభాగంలో రోప్ కార్, లైన్ ఫాలోవర్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, సర్వో స్వీప్, మాన్యువల్ బూమ్ బారియర్, ఆటోమేటిక్ నైట్ లాంప్ వంటి ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. కోడింగ్ విభాగంలో పైథాన్, హెచ్ టి ఎమ్ ఎల్, ఇంటర్నెట్ సేఫ్టీ, ఆటోమేటిక్ రెయిన్ షీల్డ్, క్యాలిక్యులేటర్, ఎర్త్ అరౌండ్ ది సన్, బర్త్డే కేక్, ఫ్లాగ్ బుక్ వంటి ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే స్కిల్ దర్బార్లో డిజిటల్ స్టోరీ టెల్లింగ్, ఈకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాగ్ వంటి ప్రాజెక్టులు ప్రదర్శించబడ్డాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.