26-01-2026 03:15:51 AM
జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నుండి స్వీకరణ
రాజన్న సిరిసిల్ల, జనవరి 25(విజయ క్రాంతి): ఓటర్ల నమోదు, ఓటరు అవగాహన కార్యక్రమాలు, పారదర్శకమైన ఎ న్నికల నిర్వహణలో విశేష కృషి చేసినందుకు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందజేశారు.గరిమ అగ్రవాల్ గతంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇఆర్వో గా పనిచేసిన సమయంలో, ఓటర్ల నమోదు, ఓటరు అవగాహన కార్యక్రమాలు, పారదర్శకమైన ఎ న్నికల నిర్వహణలో విశేష కృషి చేసినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మై ఇండియా.. మై ఓట్ అనే థీమ్ తో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఆదివారం వేడుకలు నిర్వహించి, ఉత్తమ సేవలు అందించిన జిల్లా కలెక్టర్లు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈఆర్‌ఓ లకు అవార్డులు అందజేశారు.ఈ సందర్భంగా రా ష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఈఓ సుదర్శన్ రెడ్డి నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్నారు.ఉత్తమ సేవలు అందించి అవార్డు పొందిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు జిల్లా అధికారులు, యంత్రాంగం శుభాకాంక్షలు తెలియజేశారు.