26-01-2026 03:10:53 AM
ముకరంపుర ,జనవరి 25,( విజయ క్రాంతి): కరీంనగర్ మార్కెట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి 9వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరియు ఈరోజు రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్యప్రభ వాహన సేవలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.గతంలో మాజీ మంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం కొనసాగిస్తుందని, రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం దాతలు, పూజా కార్యక్రమాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు