22-12-2025 01:31:33 AM
హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి
అతిథులను ఆప్యాయంగా పలకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (విజయక్రాంతి): శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఎట్ హోం వేడుకగా సాగింది. పచ్చని ప్రకృతి ఒడిలో, చారిత్రక భవన ప్రాంగణంలో జరిగిన తేనీటి విందు కార్యక్రమానికి రాష్ట్ర రాజకీయ, అధికార ప్రముఖులు భారీగా తరలివచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులందరినీ చిరునవ్వుతో ఆహ్వానిస్తూ, ఆత్మీయంగా ముచ్చటించారు. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో రాష్ట్రపతి కాసేపు ముచ్చ టించారు. సీనియర్ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాకతో కార్యక్రమంలో మరింత సందడి నెలకొంది.