22-12-2025 01:31:22 AM
బచ్చన్నపేట. డిసెంబర్ 21 విజయక్రాంతి బచ్చన్నపేట మండలం నక్కవానిగూడెం గ్రామం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కన్రాజ్ రవీందర్ ను గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, మండల ఇంచార్జ్ బండ కింది హరిబాబు గౌడ్, మాజీ ఎంపిటిసి ఎండి మసూద్ మాజీ మార్కెట్ చైర్మన్ మాసపేట రవీందర్ రెడ్డి, ఓబిసి కాంగ్రెస్ జిల్లా వైస్ చైర్మన్ చెరుకూరి శ్రీనివాస్, గ్రామ సీనియర్ నాయకుడు కామీడీ అమృతా రెడ్డి ఆధ్వర్యంలో ప్రకటించారు.
అనంతరం నూతన అధ్యక్షుడుగా ఎన్నుకోబడిన క న్రాజ్ రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు ముందుండి అందిస్తానని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో అ నేక సంక్షేమ పథకాలు అమలు అవుతాయని, దానికి రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన నిదర్శమని అన్నారు. గ్రామంలో ఉన్న అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుపుకొని రానున్న ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాన కార్యదర్శి కొయ్యడి శ్రీనివాస్, బొట్టు గణపతి, ఉపాధ్యక్షులు బొట్టు సత్తయ్య గోద లపరశురాములు, కరికే శ్రీకాంత్ ,నక్క వెంకటేష్, కార్యదర్శి తుపాకుల దుర్గేష్, బైరగోని రాజు, బైరగొని కుమార్ ,గోదాల సంపత్, సహాయక కార్యదర్శి తలారి చంద్రయ్య ,బిచ్చల రాజు, ఎలగందుల సిద్దులు, గుర్రాల ఉపేందర్ ,పాక కిష్టయ్య ,కామెడీ నర్సిరెడ్డి ,గంపల ప్రదీప్, యూత్ అధ్యక్షులు బొట్టు అనిల్ కుమార్, యూత్ ఉపాధ్యక్షులు బైరగొని వెంకటేష్, బొట్టు కరుణాకర్, కార్యవర్గ సభ్యులు మొగోల్ల జంబయ్య పంబాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.