calender_icon.png 22 December, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు ములకనూర్ మోడల్ స్కూల్ విద్యార్థి ఎంపిక

22-12-2025 01:32:57 AM

భీమదేవరపల్లి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): హనుమకొండ లోని సెంట్ పీటర్స్ స్కూల్లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో ముల్కనూర్ మోడల్ స్కూల్ నుండి ముగ్గురు విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో తొమ్మిదవ తరగతి విద్యార్థి బొల్లంపెల్లి తనీష్ చేసిన ప్రాజెక్ట్, వేస్ట్ మేనేజ్మెంట్ జిల్లా స్థాయిలో మొదటి బహుమతి సాధించడమే కాకుండా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ కి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ముజీబుర్ రెహ్మాన్ తెలిపారు. అలాగే 8వ తరగతి విద్యార్థి అభిరామ్ జిల్లా స్థాయి రెండవ బహుమతిని గెలుచుకున్నాడని, వీరిద్దరికీ గైడ్ టీచర్లుగా స్వరూప, సునీత వ్యవహరించారన్నారు. ముల్కనూరు మోడల్ స్కూల్ విద్యార్థి రాష్ట్రస్థాయి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.