15-07-2025 12:47:20 AM
కరీంనగర్, జూలై 14 (విజయ క్రాంతి): తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో ఏఐసిటిఈ శిక్షణ, అభ్యాసం (అటల్) అకాడమీ వారి సౌజన్యంతో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో ‘అటానమస్ & కనెక్టెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ‘ అంశంపై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కా ర్యక్రమానికి ఎన్‌ఐటి వరంగల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ ఎన్ వి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం మొదటి రోజు బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ జవ్వాడి సాగర్ రావు మాట్లాడుతూ ఫ్యాకల్టీ సభ్యులు, పరిశోధకులు, పరిశ్రమ నిపు ణులకు ఎలక్ట్రిక్ మొబిలిటీ, అటానమస్ డ్రైవింగ్, వెహికల్ కనెక్టివిటీలో తాజా పురోగతుల గు రించి సమగ్రమైన జ్ఞానాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరి, కరస్పాండెంట్ జె సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి అనిల్ కుమార్, డీన్ అకడెమిక్స్ డా పీకే వైశాలి, కార్యక్రమ కన్వీనర్ ప్రవీణ్ కుమార్, నిర్వాహకులు డా యం మణికందన్ , డా ఆర్ రమేష్ , విఎన్‌ఆర్‌విజెఐటి, సివిఆర్, టీ కేఆర్,జేబీఐటి, కిట్స్ వరంగల్, కిట్స్ సింగపూర్, వాగ్దేవి, ఎంఆర్‌సిఐటి, జయముఖి, నిగమ, ట్రినిటీ , జిట్స్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులుపాల్గొన్నారు.