calender_icon.png 15 July, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్ అయిన డివిజన్ హద్దులు

15-07-2025 12:48:14 AM

  1. ధికారికంగా ప్రకటించని వైనం 

కొత్తగూడెం లో 29 , పాల్వంచలో 27, సుజాతనగర్ లో 4

కనుమరుగైన పాత వార్డులు 

25 ఏళ్ల తర్వాత పాల్వంచలో ఎన్నికలు

ఎన్నికల నిర్వహణకు. సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం 

భద్రాద్రి కొత్తగూడెం జులై 14 (విజయ క్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్ లో డివిజన్లో ఫైనల్ అయినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. మొత్తం 60 డివిజన్లతో ఫై నల్ ముసాయిదాను ప్రభుత్వం తాజాగా రి లీజ్ చేసిన విషయం విధితమే. ఆగస్టు నెల లో కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతాయ ని ప్రచారం ముంబరంగా సాగుతున్న నేపథ్యంలో, అధికార యంత్రాంగం ఎన్నికల ని ర్వహణకు సిద్ధమవుతోంది.

పాల్వంచ, కొత్తగూడెం, మున్సిపాలిటీలతోపాటు సుజాతన గర్ మండలంలోని మంగపేట, నరసింహసాగర్, నాయకులగూడెం ,లక్ష్మీదేవిపల్లి సుజాతనగర్, నిమ్మలగూడెం, కోమటిపల్లి పం చాయితీలను కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం కొ త్తగూడెం కార్పొరేషన్ రెండు నెలల క్రితం ప్రకటించిన విషయం విధితమే. దీంతో కొత్తగూడెంలో 29, పాల్వంచలో 27, సుజాత నగర్ మండలంలో 4 డివిజన్లు మొత్తం 60 డివిజన్లతో కొత్తగూడెం కార్పొరేషన్ ముసాయిదాను ప్రభుత్వం ప్రకటించింది. డివిజన్లో ఏర్పాటుతో అంతా కొత్త కొత్తగా మారిపోయింది.

రెండు మున్సిపాలిటీలలోను పాత వార్డులు కనుమరుగయ్యాయి. కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్న అనేక వార్డులు చిన్న భిన్నం అయ్యాయి. ఒక్కొక్క మున్సిపల్ వా ర్డులో 1000 నుంచి 1500 ఓటర్లు ఉండేవి. డివిజన్లో ఏర్పాటుతో 2220 నుంచి 2500 ఓటర్లతో హద్దులను ఏర్పాటు చేశారు. దీంతో ఆశావాహుల్లో గందరగోళం నెలకొంది. కొత్తగా ఏర్పడిన డివిజన్లలో రాజ కీయ ప్రభావం చోటుచేసుకుందని మాజీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.

కొందరు రాజకీయ నాయకులతో కుమ్మక్కై కార్పొరేషన్ అధికారులు నాయకులు చెప్పినట్టుగా డివిజన్లు ఏర్పాటు చేశారనే విమర్శలు తలె త్తుతున్నాయి. మేదర్ బస్తి కూలీ లైన్ చమన్ బస్తీలతో పాటు పొల మున్సిపల్ పాత వార్డులు నామరూపాలు లేకుండా పోయాయని కౌన్సిలర్లు ఆఫీసర్లపై మండిపడుతు న్నారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది తమకు వ్యతిరేకంగా ఉన్న పాత ము న్సిపల్ వార్డులతో పాటు, వచ్చే ఎన్నికల్లో వారికి అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతో డివిజన్లను ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు.

కార్పొరేషన్ లో డివిజన్లో సంబం ధించి ఫైనల్ ముసాయిదానం ప్రభుత్వం రిలీజ్ చేసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు. కార్పొరేషన్ వివరాలను బహిర్గతం చే యకుండా గోప్యంగా ఉంచుతున్నా రని బిజెపి సిపిఎం పార్టీ నేతలతోపాటు, కాంగ్రె స్ నాయకులు సైతం మండిపడుతున్నారు. 

హైకోర్టులో పిటిషన్లు దాఖలు? 

ఇదిలా ఉంటే కొత్తగూడెం కార్పొరేషన్ లో డివిజన్ ఏర్పాటుతో పాటు ఏజెన్సీ చట్టా లు అమలవుతున్న పాల్వంచ పట్టణం ను, సుజాతనగర్ మండలంలోని పంచాయితీలను కార్పొరేషన్ లో ఎలా విలీనం చేస్తారం టూ పలువురు గిరిజన సంఘాల నాయకు లు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఒకవైపు డివిజన్ల ఏర్పాట్లు గందరగోళం, మరోవైపు ఏజెన్సీ చట్టాల ఉల్లం ఘన కార్పొరేషన్ ఎన్నికలకు అవరోధాలుగా మారుతాయని ప్రచారం సాగుతోంది.

హైకోర్టులో ఆ ప్రభుత్వానికి చుక్కెదురై అయితే గత 25 సంవత్సరాలుగా పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకుండా ప్రత్యేక అధి కారి పాలనలో సాగింది, అదే పరిస్థితి కొత్తగూడం మున్సిపాలిటీ ఉత్పన్నమయ్యే ప్ర మాదం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు వ్యవహారం ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే 25 ఏళ్ల తర్వాత పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికల యోగం పట్టనుంది. 

డివిజన్ హద్దులు మాత్రమే ఖరారయ్యాయి 

ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో 60 డివిజన్లను ఏర్పాటు చేస్తూ హద్దులను నిర్ణయించడం జరిగిందన్నారు. ఒక్కొక్క డివిజన్లో 220 నుంచి 2500 మం ది ఓటర్లు ఉండేలా హద్దులు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ఓటర్ల జాబితా సిద్ధం ఇంకా సిద్ధం కాలేదన్నారు.

 సుజాత మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్