calender_icon.png 15 July, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ట్రాక్ సూట్ల పంపిణీ

15-07-2025 12:45:49 AM

చొప్పదండి, జూలై 14 (విజయ క్రాంతి): గంగాధర మండలం గర్శకుర్తి ప్రాథమిక పాఠశాల లో 31 మంది విద్యార్థులకు గంగాధర మాజీ ఎంపిటిసి పెరుక మల్లారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కు మారుడు మాజీ ఎంపిటిసి పెరుక శ్రవణ్ కుమార్ ట్రాక్ సూట్లను పంపిణీ చేశారు. భవిష్యత్తులో విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్, పెన్నులు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మొలంకుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు కోట శ్యామ్ కుమార్, అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ చైర్మెన్ రేణికుంట రిష్మిత, కమిటీ సభ్యులు చిందం ఆంజనేయులు, రాములు, తిరుపతి, శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రణయ్, అశోక్, తదితరులుపాల్గొన్నారు.