calender_icon.png 15 July, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయాలి

26-05-2025 07:00:33 PM

యూనిట్ అధికారులను ఆదేశించిన ఐటీడీ పి ఓ రాహుల్..

భద్రాచలం (విజయక్రాంతి): ఆదివాసి గిరిజన గ్రామాల నుండి గిరిజన దర్బార్లో తమ సమస్యల గురించి విన్నవించుకోవడానికి వచ్చే గిరిజనుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందించే విధంగా సంబంధిత యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్ అధికారుల సమక్షంలో వివిధ ఆదివాసి గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు పొడు భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, భూ సమస్యలు, స్వయం ఉపాధి పథకాల రుణాల కొరకు, పట్టా భూములకు రైతుబంధు రుణాల కొరకు, జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక సహాయం కొరకు, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక వేసులుబాటు కల్పించుట కొరకు, ట్రైకార్ రుణాలు, గురుకులం కళాశాల, పాఠశాలల్లో సీట్ల కొరకు, పై చదువులు చదవడానికి ఆర్థిక సహాయం కొరకు, వ్యవసాయ భూములకు కరెంటు బోరు మోటార్ ఇప్పించుట కొరకు, సిఆర్టి ఉద్యోగాల కొరకు, పొడు పట్టాలలో పేర్లు మార్పు కొరకు, నూతనంగా మత్స్య సొసైటీలు ఏర్పాటు కొరకు, సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించుట కొరకు, తమ పొలాలలో బోరు బావులు తవ్వించుటకు అనుమతి కొరకు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కొరకు దరఖాస్తులు చేసుకున్నారని ఆయన అన్నారు.

ఖమ్మం మండలం సింగారం గ్రామానికి చెందినవెంకటేశ్వర్లు సిఆర్టి ఉద్యోగం కొరకు, కామేపల్లి మండలం గోవిందరాల గ్రామానికి చెందిన మంగీలాల్ గురుకులంలో సీటు ఇప్పించుట కొరకు, టేకులపల్లి మండలం మూర్తులతండకి చెందిన లక్ష్మయ్య తమ పొలంలో బోరు బావి తవ్వించుకోవడానికి అనుమతి కొరకు,పెనుబల్లి మండలం గట్టిగూడెంకు చెందిన నాగేశ్వరరావు కరెంటు బోరు మోటారు ఇప్పించుట కొరకు, ఇల్లందు మండలం దండ గుండాల గ్రామానికి చెందిన సునీత అంగన్వాడి టీచర్ ఉద్యోగం కొరకు, జూలూరుపాడు మండలం కర్రెవారి గూడెంకు చెందిన రాంబాబు ట్రైకార్ రుణాల కొరకు, అశ్వరావుపేట మండలం అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన కృష్ణ మంచినీరు, రోడ్లు, కరెంటు ఏర్పాట్ల కొరకు, పాల్వంచ మండలం పోనుకుల గ్రామానికి చెందిన వెంకటమ్మ క్రాఫ్ లోన్ ఇప్పించుట కొరకు, దరఖాస్తులు చేసుకున్నారని ఆయన అన్నారు. 

గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని ఆన్లైన్ ద్వారా ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు చేపడతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఆర్.సి.ఓ గురుకులం అరుణ కుమారి, ఎస్ డిసి రవీంద్రనాథ్, ఏవో సున్నం రాంబాబు, ఎస్ఓ భాస్కరన్, ఏపీ ఓ పవర్ వేణు, డిటిఆర్ఓఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, డిఎంజెసిసి సమ్మయ్య, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, ఏసీఎంఓ రమణయ్య, డిటిఎల్టిఆర్ మనిధర్, మేనేజర్ ఆదినారాయణ,హెచ్ ఈ ఓ లింగా నాయక్, జేడీఎం హరికృష్ణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ అనసూయ, ఇతర విభాగాల సిబ్బంది భద్రమ్మ, భార్గవి, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.