calender_icon.png 26 August, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

26-08-2025 01:51:31 AM

సిద్దిపేట, ఆగస్టు 24 (విజయక్రాంతి):  సిద్దిపేట జిల్లా అథ్లెటిక్స్ సంఘ ఆధ్వర్యంలో స్థానిక స్టేడియంలో జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షులు గ్యాదరి పరమేశ్వర్, డి.వై.ఎస్.వో వెంకట నర్సయ్యలు  సంయుక్తంగా సోమవారం ప్రారంభించారు.

అండర్ 14,16,18,20 సంవత్సరాల బాలబాలికలు పరుగు, జంప్స్, త్రోస్ విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ సంఘము ప్రధాన కార్యదర్శి కర్రోళ్ల వెంకటస్వామి గౌడ్, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కడకంచి ఉప్పలయ్య, సంఘ బాధ్యులు  నిశాంక్ గౌడ్, సాగర్, రాజు, లీలఆనంద్, లక్ష్మన్, శంకర్ పాండ్య, యెశ్వంత్, ఉమేష్, గణేష్ పీడీలు ప్రవీణ్, సురేష్, కనకరాజు, శారద  తదితరులు పాల్గొన్నారు.