calender_icon.png 26 August, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలి

26-08-2025 01:50:18 AM

ప్రముఖ చేతిరాత నిపుణులు, మోటివేషనల్ స్పీకర్ అజాజ్ అహ్మద్ 

సిద్దిపేట, ఆగస్టు25 (విజయకాంతి):  స్వీయ క్రమశిక్షణ కలిగి ఉన్న విద్యార్థులు ఉన్నత స్థానాలలో స్థిరపడతారని ప్రముఖ చేతివ్రత నిపుణులు, మోటివేషనల్ స్పీకర్ ఎజాజ్ అహ్మద్ సూచించారు. సోమవారం సిద్దిపేట శ్రీవారు పొన్నాలలో గల ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఓరియంటేషన్ సమావేశంలో ఎజాజ్ అహ్మద్ మాట్లాడారు.

వినయము, విజ్ఞానం, విచక్షణ కోల్పోని విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటారని సూచించారు. ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వచ్చి విచ్చలవిడితనానికి అలవాటు పడినప్పుడు క్రమశిక్షణ కోల్పోతారని తెలిపారు. ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో చదివిన అనేకమంది విద్యార్థులు వివిధ హోదాలలో స్థిరపడ్డారని గుర్తు చేశారు. సామాజిక మాధ్యమాలపై దృష్టి సారించకుండా వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి సారించి పుస్తక పఠనం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హిందూర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్లు పద్మావతి, పాండురంగం, తదితరులు పాల్గొన్నారు.