calender_icon.png 22 September, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ పాఠశాలలు అధికారులకు ఏటీఎంలు

22-09-2025 12:36:21 AM

- జిల్లాలో ఇస్తారా ప్రైవేట్ పాఠశాలలు

- ఒక్కొకటిగా వెలుగులోకి

- ఇలా అయితే ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం ఎలా? 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి):ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభు త్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చెడుతు న్నా, నూతన సంస్కరణలు తీసుకొస్తు న్నా, స్వయంగా రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రే వి ద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నా, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో లక్ష్యం నీరు కారి, ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా రాజ్యమేలుతున్నా యి.

అందుకు జిల్లాలో ఇటీవల బహిర్గతమైన సంఘటనలే చక్కని ఉదాహరణలు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో గల చుం చుపల్లి మండలం చుంచుపల్లి తండా లో శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాల గత మూడు సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుం డా నిర్వహించబడుతుందనే విషయాన్ని విజయక్రాంతి ఏడాది క్రితమే వెలుగులోకి తెగ, స్పందించిన విద్యాశాఖ అధికారులు మత్తు వదిలి ఆ పాఠశాలను చివరికి సీజ్ చేశారు.

ఇదిలా ఉండగా నిన్న పాల్వంచ మండలంలో నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అనుమతులు ఒకచోట... పాఠశాల నిర్వహణ వేరొక చోట.. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడుతుందనే అంశాన్ని వెలుగులోకి తేవడంతో స్పందించిన రీజినల్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రెండు రోజుల్లో నా రాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అనుమతులకు సంబంధించిన పూర్తి సమాచా రాన్ని సమర్పించాల్సిందిగా డీఈఓ ను ఆదేశించడం గమనార్హం. ప్రైవేటు పాఠశాలలపై అధికారుల అజ్మాయిషి కొరబడింది అనటానికి చక్కని తార్కాణం. అధికారుల అండదం డలు లేనిదే ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా కొనసాగించారని, అధికారులకు ప్రైవేటు పాఠశాలలు ఏ టీ ఎం లుగా మారినట్లు సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఓకే భవనం ఇంటి నంబర్‌పై రెండు ప్రైవేటు పాఠశాలలు ?

కొత్తగూడెం పట్టణంలోనీ నడి బొడ్డులో గల మేదర్ బస్తి 23వ వార్డులో గల 7- 7- 173 లో శ్రీ రాగా పాఠశాలనిర్వహించ బడుతోంది. ఆ పాఠశాలకు వరంగల్ ఆర్జెడి నుం చి అనుమతులు ఉన్నాయి. 2021- 22 విద్యా సంవత్సరం నుంచి 2029- 30 విద్యా సంవత్సరం వరకు అనుమతులు పొంది ఉన్నారు. అలాంటి భవనం పైనే మరో నూతన పాఠశాల ఎస్.ఆర్.కె.టి ప్రారంభ అనుమతుల కై అప్పటి ఉమ్మడి కొత్తగూడెం మండల విద్యాధికారి ప్రతిపాదనలో పంపటం విశేషం. ఓకే ఇంటి నెంబర్ పై రెండు ప్రైవేటు పాఠశాల నిర్వహించడం ఎలా సాధ్యమని, ఇది అధికారుల వింత పోకడకూ సాక్ష్యం.

నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపాదనలు వచ్చిన అప్పటి డి ఈ ఓ 7- 7- 173 భవనంలో ఎస్ ఆర్ కే టి పాఠశాలకు ఓపెనింగ్ పర్మిషన్ ఇవ్వడం, అప్పటివరకు అదే భవనంలో కొనసాగుతున్న శ్రీ రాగా పాఠశాల ఎలాంటి అనుమ తులు లేకుండా 7- 7- 172/2 ఇంటి నెంబర్లు భవనంలోకి మార్చిన అధికారులు సైతం గు ర్తించకపోవడం శోచనీయం. ఒకే ఇంటి నెం బర్ గల భవనంపై శ్రీ రాగా పాఠశాల, ఎస్ ఆర్ కే టి పాఠశాలలకు ప్రతిపాదనలు పం పటం గత ఉమ్మడి కొత్తగూడెం మండల విద్యాధికారి పనితీరుకు నిదర్శనం.

ఈ అం శాన్ని కొత్తగూడెం మండల విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టి, ఇటీవల పదవి విరమణ చేసిన ఆ అధికారి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందిన రెండు పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయ టం జరిగింది. నోటీసు స్వీకరించిన ఎస్ ఆర్ కే టి పాఠశాల యాజమాన్యం కోర్టును ఆశ్రయించి నిలుపుదల చేసుకోగా, శ్రీ రాగా పాఠశాల యాజమాన్యం 7- 7- 172/2 లోకి మార్చినట్లు ప్రతిపాదనలను సమర్పించినట్లు తెలిసింది. దీన్నిబట్టి ఆ రెండు పాఠశా లలకు ఇప్పటివరకు పూర్తిస్థాయి నూతన అనుమతులు లేదన్నది స్పష్టం అవుతుంది. ఈ తరహాలో సరైన వసతులు, సౌకర్యాలు, క్రీడా మైదానాలు, చివరికి గుర్తింపు పరమేషన్లు లేకుండా జిల్లా వ్యాప్తంగా ఇబ్బడి ము బ్బడిగా ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించబడుతున్నట్లు స్పష్టమవుతుంది.

ప్రభుత్వ ఆదేశాలను ఆమలు చేస్తారా?

రాష్ట్ర ప్రభుత్వం ధసరా సెలవల్లో సకల పాఠశాలలను నిర్వహించవద్దని స్పష్టమైన ఆ దేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రవేట్ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయ టం లేదని తెలుస్తోంది. పాల్వంచ పట్టణంలోని రెజీనా కాన్వెంట్ పాఠశాల ప్రభుత్వం జారీ చేసిన సెలవల ప్రకారం కాకుండా, వా రి ఇష్టానుసారంగా సెలవులు ప్రకటించినట్లు ఇప్పటికే విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మిగిలిన ప్రైవేటు పాఠశాలలు ప్రభు త్వ ఆదేశాలను అమలు చేస్తారో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉండగా పదవ తరగతి పరీక్ష ఫీజు రూ 130 గా ప్రభుత్వ నిర్ధారిస్తే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు రూ వేల ల్లో వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్న తాధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల వాస్తవ పరిస్థితు లపై క్షుణ్ణంగా పరిశీలించి పటిష్టమైన చర్య లు తీసుకోవాలని, విద్యార్థుల జీవితాలతో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు చలగాటమాడోద్దనికోరుతున్నారు.