calender_icon.png 22 September, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ పండుగకు రెండేసి ఇందిరమ్మ చీరలు

22-09-2025 12:00:00 AM

  1. నేటి నుంచి పంపిణీ

ఏర్పాట్లు చేసిన డీఆర్డీవో అధికారులు

కరీంనగర్, సెప్టెంబరు 21 (విజయ క్రాంతి): బతుకమ్మ పండుగకు ఈసారి గ్రా మైక్య సంఘాల మహిళలకు రెండు చీరల చొప్పున అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ని ర్ణయించింది. ఇందుకుగాను 318 కోట్ల రూ పాయలు చీరల తయారీకి కేటాయించింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా 65 లక్షల చీరల తయారీకి సిరిసిల్ల నేతన్నల కు ఆర్డర్ ఇచ్చింది. 6 వేల మంది నేత కార్మికులు రెండు షిఫ్టుల్లో వీటిని తయారుచేసి ఉపాధి పొందారు.

చేనేత జౌళిశాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ ఎప్పకటిప్పుడు పర్య వేక్షించారు. జిల్లాలో 13,748 స్వయం సహా య సంఘాలు ఉండగా మొత్తం 1,47,723 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలు జిల్లాలో 2.52 లలక్షల మంది ఉన్నారు. వీరందరికి చీరలను పంపిణీ చేసేందుకు అ ధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఆడబిడ్డలందరికీ చీరలు ఇవ్వాలని మహిళలు కోరుతు న్నారు. మిగతా ఆడబిడ్డలకు మొండిచేయి చూపవద్దని అంటున్నారు. 

- నేటి నుంచి పంపిణీ...

మహిళా శక్తి పథకం ద్వారా అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక పేరిట మహిళలకు చీరలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేర కు వివిధ డిజైన్లలో చీరలను తయారు చేయ గా ఒక్కో మహిళకు రెండు చీరలు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టగా, గత సంవత్సరం చీరల పంపిణీ కార్యక్రమానికి బ్రేక్ పడింది. తాజాగా ఈ నెల 22 నుంచి చీ రలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

జిల్లావ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 18 సంవత్సరాలు నిండిన స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు డీఆర్డీవో శాఖ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మండలాలు, గ్రా మాలకు చీరలు చేరనున్నాయి. సంఘాల్లో ఉన్న సభ్యులకు రెండేసి చొప్పున పంపిణీ చేస్తారా లేక రెండవ విడతలో మరికొన్ని తె ప్పిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంపిణీ జరుగుతుందని డీఆర్డీవో