18-10-2025 12:00:00 AM
కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు, తాడ్వాయి, అక్టోబరు 17 (విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం ప్రాంగణ అభివృద్ధి పనులలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు శుక్రవారం ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. క్షేత్ర స్థాయిలో పరిశీలిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మేడారం దేవాలయం ప్రాంగణ అభివృద్ధి పనుల మ్యాప్ ప్రకారం తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు పలు సూచనలను చేశారు. ప్రతి రోజు వచ్చే భక్తులకు ఆటంకం కలుగకుండా పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.