calender_icon.png 9 October, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టు సీజేఐపై దాడి గర్హనీయం

08-10-2025 12:02:52 AM

  1. నిందితుడిని కఠినంగా శిక్షించాలి

తుర్కయంజాల్ అఖిలపక్ష నేతల డిమాండ్

తుర్కయంజాల్, అక్టోబర్ 7: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడిని అఖిలపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. తుర్కయంజాల్ అంబేద్కర్ చౌరస్తాలో సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు సీజేఐపై జరిగిన దాడి యావత్ భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు.

దేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపై దాడి జరగడం హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మంపేరుతో దాడులకు పాల్పడటం ఘోరమన్నారు. సీజేఐ దళితుడు కాబట్టే ఆయనపై దాడి చేశారని మండిపడ్డారు.నిందితుడు రాకేష్ కిష్పో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నాయకులు ఓరుగంటి యాదయ్య, సీపీఎం జిల్లా నాయకుడు డి.కిషన్, బీజేపీ నేత బచ్చిగళ్ల రమేష్, బీఎస్పీ నేతలు వద్దిగళ్ల బాబు, పట్నం రమేష్, మేతరి కుమార్, సీపీఎం నాయకులు ఆశీర్వాదం, సత్యనారాయణ, జ్యోతిబసు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొమ్మని దర్శన్, గోపాల్, వినోద్, సాయి, భగత్ తదితరులు పాల్గొన్నారు.