calender_icon.png 15 July, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొడ్డ నారాయణరావు కుటుంబానికి పరామర్శ

15-07-2025 01:00:11 AM

చిలుకూరు, జులై 14: ఈనెల 11 శుక్రవారం నాడు సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు దొడ్డ నారాయణరావు అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది.  సోమవారం దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, మిర్యాలగూడెం మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు లు, వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేయడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ దొడ్డ నారాయణరావు మృతి సిపిఐ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బట్టు శివాజీ నాయక్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు జానీమియా, పిఎసిఎస్ చైర్మన్ అలస కాని జనార్ధన్, రైతు సంఘం ఆలిండియా కమిటీ సభ్యులు దొడ్డ వెంకటయ్య, తాళ్లూరి శ్రీనివాస్, అంబాల రాంబాబు, పాష, రఫీ, రాంబాబు, మాజీ వార్డ్ మెంబర్ ఎస్, పిచ్చయ్య, అల్లి ఉపేందర్, కోడారు శ్రీను, రాజు, పాల్గొన్నారు.