24-10-2025 12:47:38 AM
గో రక్షకునిపై దాడిని ఖండిస్తూ బీజేపీ నిరసన
ఆదిలాబాద్/నిర్మల్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మళ్ళీ హిందువులపై దాడులు పెరిగాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్ ఆరోపించారు.
గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ సోను పై ఎంఐఎం గుండాల దాడిని ఖండిస్తూ ఆదిలాబాద్ లో గురువారం పార్టీ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు బీజేపీ నాయ కులు యత్నించగా, వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను కలిసి వినతి పత్రం ఇచ్చారు.
ప్రశాంతను పరామర్శించిన నిర్మల్ జిల్లా బీజేపీ నేతలు
హైదరాబాదులో భూసంరక్షకుడు ప్రశాం త్‌పై దాడి జరగగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గురువారం నిర్మల్ బిజెపి నేతలు పరామర్శించారు. బిజెఎల్‌పి నేత మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
భూ సంరక్షకుడు ప్రశాంతపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని దీనికి ప్రభుత్వమే బాధ్యత పెంచాలని బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రశాంత్ పై దాడిని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చిన్నారెడ్డి సత్యం చంద్రకాంత్ బూర రమేష్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.