calender_icon.png 24 October, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెరమీదికి వెలిచాల ప్యానెల్

24-10-2025 01:26:56 AM

  1. స్వంత ప్యానెల్ పై కర్ర

అయోమయంలో విలాస్ రెడ్డి

అర్బన్ బ్యాంకుకు 73 నామినేషన్లు

కరీంనగర్, అక్టోబరు 23 (విజయ క్రాంతి): కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకుకు నవంబర్ 1న జరగనున్న ఎన్నికలకు పోటీ చేసేందుకు 12 డైరెక్టర్ స్థానాలకు 73 నామినేషన్లు దాఖలు చేశారు. జనరల్ కేటగిరి కింద 55, ఎస్సీ, ఎస్టీ కేటగిరి కింద 11, మహిళా కేటగిరీలో 7 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం నామినేషన్ల పరిశీలన, శనివారం నామినేషన్ల ఉపసంహరణ ఉం టుంది. నవంబర్ 1న ఎన్నికలు జరగనున్నా యి.

అర్బన్ బ్యాంకు చైర్మన్ గా మూడు ప ర్యాయాలు పనిచేసిన కర్ర రాజశేఖర్ ప్యా నెల్ తో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నా రు. కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ కాకుండా అందరిని కలుపుకుని ప్రచారం నిర్వహించాలని నిర్ణయించుకుని ప్యానెల్ రూపొందించుకున్నారు. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్ రూపొందించే పనిలో పడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి చెం దినవారితో ఈ ప్యానెల్ ను ఏర్పాటు చేసే దిశగా ఆయన బుధ, గురువారాల్లో సమావేశాలు నిర్వహించారు. చైర్మన్ అభ్యర్థి ఎవర న్నది ముందే ప్రకటించకుండా ఆయన ప్యా నెల్ ఏర్పాటులో ఉండగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పై ఇం చార్జి చైర్మన్ గా పనిచేసిన విలాస్ రెడ్డి ప్యానె ల్ ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధం కాగా ఆయన ప్యానెల్ లో ఉన్న ఒకరిద్దరు రాజేందర్రావు వర్గంవైపు వెళ్లడంతో ఆయన అ యోమయంలో పడ్డారు.

ఇదిలా ఉండగా జి ల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో పార్టీ తరపున ప్యా నెల్ ఉండదని, అయితే మావారే గెలుస్తారని ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాల్లో అయోమయం నెలకొంది. రాజేందర్రావు ప్యానెల్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకోగా క వ్వంపల్లి ప్రకటన, కర్ర రాజశేఖర్ ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేసుకొని ప్రచారం ప్రారంభించడంతో అర్బన్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

- చివరిరోజు భారీగా నామినేషన్లు...

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు బుధవారం 40 నామినేషన్లు దాఖలు కాగా, గురువారం 33 నామినేషన్లు దాఖలయ్యా యి. డైరెక్టర్ స్థానాలకు చివరి రోజు నామినేషన్ దాఖలు చేసినవారిలో తాటికొండ భాస్కర్, తిరుమణి కరుణాకర్, నజీర్ అహ్మ ద్, ఎడబోయిన రామకృష్ణారెడ్డి, ఎండి బషీర్, లక్క రాజేశం, చిందం శ్రీనివాస్, ఉమ్మెంతల శ్రీనివాస్ రెడ్డి,

ఎలగందుల మునీందర్, ఇరుమల్ల మల్లేశం, అక్కెనపల్లి కాశీనాథం, కన్న సాయి, బిట్ల రవీందర్, గాదె కార్తీక్, ఎస్ రాజమల్లయ్య,న్యాత సురేష్, మంచాల నర్సయ్య, చింతల కిషన్, నాగుల శ్రీనివాస్, అనంత రాజు, ఆనంద్, లింగరాజు, నరిల్ల ప్రసాద్, బత్తుల రాజ్కుమార్, మునిపల్లి ఫణిత, వరాల జ్యోతి, దామెర శ్రీలత, యాగండ్ల కావ్యలుఉన్నారు.