24-10-2025 01:27:56 AM
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖకు అ త్యుత్తమ ప్రతిభా పురస్కారం రాష్ర్టపతి చేతుల మీదుగా పొందడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. భారత ప్రభుత్వ గిరి జన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘ఆది కర్మయోగి అభియాన్’ జాతీయ సదస్సులో తెలంగాణ రాష్ర్టం గిరిజన సంక్షేమంలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ర్టంగా గుర్తింపు పొందింది. పీఎం జన్మాన్ కార్యక్రమంలో తెలంగాణ దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.
ధర్తీ ఆబా జంజాతి గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్‌లో సమాజ భాగస్వామ్యంలో దేశంలో 6వ స్థానంలో వచ్చింది. ఆది కర్మయోగి అభియాన్‌లో ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు, ఐటీడీఏలు భద్రాచలం, ఉట్నూర్ జాతీయ స్థాయి అవార్డులు పొందాయి. ఉత్తమ శిక్షకులుగా పద్మ పీవీ, డాక్టర్ ఏ.కీర్తి, డాక్టర్ జీ.నరేందర్ రెడ్డి ఎంపికయ్యారు. రాష్ర్టపతి ద్వారా అందుకు న్న అవార్డులను మంత్రి లక్ష్మణ్, ఆయా శాఖల అధికారులు గురువారం సీఎంకు చూపించారు.