24-10-2025 12:41:46 AM
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : తెలంగాణలో పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ గురువా రం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 లోపు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ పరీక్ష ఫీజును స్కూల్ హెడ్‌మాస్టర్‌కు చెల్లించాలని తెలిపింది.
హెచ్‌ఎంలు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లింపు చేసి ఆ వివరాలను నవంబర్ 18లోపు డీఈవోలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక రూ. 50 లేటు ఫీజుతో నవంబర్ 29 వరకు, రూ. 200 డిసెంబర్ 11వ తేదీ వరకు, రూ. 500 డిసెంబర్ 15 నుంచి 29 వరకు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.