calender_icon.png 25 July, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ షాపులపై దాడులు

24-07-2025 12:51:12 AM

ఘట్ కేసర్, జూలై 23 : విజయక్రాంతి దినపత్రికలో బుధవారం ప్రచురించిన జోరుగా మం దుల దందా, నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు, ఫార్మసిస్ట్ లేకుండానే నిర్వహణ, అధిక ధరలకు మందుల అమ్మకాలు అనే కథనానికి డ్రగ్స్ కంట్రోల్ బోర్డ్ అధికారులు స్పందించి తనిఖీలు జరిపారు.

డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, డైరెక్టర్ జనరల్, షాన్ నవాజ్ ఖాన్ (ఐపిఎస్) సూచన మేరకు, అసిస్టెంట్ డైరెక్టర్ షామీర్ పేట్, ఎం. శ్రీ బిందు ఆధ్వర్యంలో డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ బి. ప్రవీణ్ షామీర్ పేట జోన్, డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ పి. అంబేద్కర్, మేడిపల్లి జోన్ ఉమ్మడి ఘట్ కేసర్ మం డలం లోని నారపల్లి, అన్నోజిగూడ, జోడీమెట్ల, వెంకటాద్రి టౌన్ షిప్, పోచారం మరియు ఘట్ కేసర్ వంటి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈతనిఖీలలో డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 మరియు రూల్స్ 1945 అమలు తీరును పరిశీలించారు. ఈతనిఖీల లో నియమ, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మందుల దుకాణాల యాజమాన్యలకు అసిస్టెంట్ డైరెక్టర్, షామీర్ పేట షోకాజు నోటీసులు జారీ చేశారు. ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొనబడును అని అధికారులు తెలిపారు.