calender_icon.png 6 October, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీఎంలో నగదు చోరీకి యత్నం

06-10-2025 12:00:00 AM

ములకలపల్లి, అక్టోబర్ 5 (విజయ క్రాంతి): ములకలపల్లి లోని ప్రధాన రహదారిలో ఉన్న ఎస్బిఐ బ్యాంక్ ఎటిఎం లో నగ దు చోరీకి గుర్తు తెలియని వ్యక్తి ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసులు గస్తికి రావడంతో వారిని చూసి పరారయ్యాడు. ఏ టీఎం నుంచి నగదును తస్కరించాలని ఆ వ్యక్తి చేసిన యత్నం విఫలమయ్యింది. శనివారం అర్ధరాత్రి వేళ పాల్వంచ- దమ్మపేట ప్ర ధాన రహదారిపై ఉన్న ఎస్బిఐ ఎటిఎం లోకి ముసుగు ధరించి వెనుక బ్యాగుతో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి నగదు చోరీ చేసేందుకు ఏటీఎంలోకి చొరబడ్డాడు.

వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన దుర్గామాత నిమజ్జనోత్సవ ఊరేగింపు ఓపక్క జరుగుతుం డగా, ఆ సమయంలో పోలీసులు బందోబ స్తు గస్తీ కోసం వచ్చారు. బ్యాంకులోని ఏటీ ఎం లో వెలుతురు లేకుండా ఉండడం చూ సిన పోలీసులు అనుమానంతో పోలీస్ వా హనం దిగి ఏటీఎం దగ్గరికి వస్తున్న విషయా న్ని పసిగట్టిన గుర్తు తెలియని వ్యక్తి చీకట్లో పరారయ్యాడు.

ఏటీఎంలోకి చొరబడిన వ్య క్తి ఫోటోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యా యి. సీసీటీవీలో రికార్డు అయిన పుటేజీని పోలీసులు సేకరించారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు ములకలపల్లి ఎస్త్స్ర మధు ప్రసాద్ ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.