08-02-2025 12:03:11 AM
చెన్నై, ఫిబ్రవరి 7: ఏపీలోని చిత్తూరుకు చెందిన గర్భిణి తమిళనాడులోని తిరుపూర్ వస్త్ర కర్మాగారంలో పనిచేస్తుంది. గురువారం ఆమె కోయంబత్తూరు నుంచి రైలులో స్వస్థలానికి బయల్దేరింది.
రైలులో ఆ గర్భిణికి హే మరాజ్ అనే సైకో ఎదురై లైంగిక దాడికి య త్నించాడు. దీంతో ఆమె తిరగబడింది. ఈ క్ర మంలో సైకో కదులుతున్న రైలు నుంచి ఆ మెను కిందకు తోసేశాడు.
ఘటనలో గాయాలపాలైన గర్భిణిని రైల్వే సిబ్బంది చికిత్స చే యిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.