08-02-2025 12:06:27 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కేంద్ర క్యాబినెట్ ప లు నిర్ణయాలు తీసుకుంది. నూతన ఆదాయ పు పన్ను చట్టానికి ఆమోదం తెలపడమే కా కుండా.. స్కిల్ ఇండియా కోసం రూ. 8,00 0 కోట్లు, పీఎం కౌశల్ వికాస్ యోజన 4.0కి రూ. ౬౦౦౦కోట్లు, జన్ శిక్షణ్ సంస్థాన్‌కు ౮ ౫౮ కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసు కున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
విశాఖ రైల్వే జోన్ కూడా..
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా పేరు మార్చింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌లో కొత్తగా రాయగడ రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
పోస్ట్ ఫ్యాక్టో కింద దీనికి ఆమోదం తెలిపింది. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం తెలంగాణకు చెందిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. మరోపక్క నూతన పన్ను చట్టాన్ని సోమవారం సభలో ప్రవేశపెట్టనున్నట్లు వినికిడి.