06-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
మనోహరాబాద్, అక్టోబర్ 5 :మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, మనోహరాబాద్ మాజీ సర్పంచ్ చిటుకుల మహిపాల్‌రెడ్డి మాతృమూర్తి చనిపోయిన విషయం విధితమే. ఇందులో భాగంగా ఆదివారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని శుభం గార్డెన్స్ లో దశదిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తో పాటు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మహిపాల్ రెడ్డి మాతృమూర్తి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు, వ్యాపారులు పాల్గొన్నారు.