calender_icon.png 9 September, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లెపూలు తీసుకెళ్లిన హీరోయిన్ 1.14 లక్షలు ఫైన్ వేసిన ఆస్ట్రేలియా

09-09-2025 12:28:09 AM

ఓనం వేడుకల కోసం ఆస్ట్రేలియా వెళ్లిన మలయాళ భామ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: మలయాళ నటి నవ్యనాయర్‌కు భారీ ఫైన్ పడింది. ఆస్ట్రేలియాలోని ‘మలయాళీ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా’ నిర్వహించిన ఓనం వేడుకలకు హాజరు కావడం కోసం నవ్యనాయర్ మెల్‌బోర్న్ వెళ్లింది. వెళ్లేటపుడు తనతో పాటు మల్లెపూలు కూడా తీసుకెళ్లింది. ఈ విషయా న్ని గమనించిన మెల్‌బోర్న్ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు సదరు నటికి రూ. 1.14 లక్షల భారీ జరిమానా విధిం చారు.

ఆస్ట్రేలియా విమానాశ్రయాల్లో కఠినమైన బయో సెక్యూరిటీ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల వల్లే నవ్యనాయర్‌కు అంత జరిమానా విధించారు. జరిమానా కట్టిన నవ్య ఈ విషయాన్ని తర్వాత జరిగిన కార్యక్రమంలో చెప్పడంతో బయటకు వచ్చింది. ఇది తప్పేనని ఉద్దేశపూర్వకంగా చేయలేదని సదరు నటి తెలిపారు.