calender_icon.png 9 September, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ నిర్ణయం సబబే

09-09-2025 12:30:16 AM

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

రష్యా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై రెండో విడత సుంకాలుంటాయన్న అమెరికా అధ్యక్షుడు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: రష్యా నుం చి చమురు కొనుగోలు చేసే దేశాల పై ఆంక్షలు విధించాలనే ట్రంప్ నిర్ణ యం సబబే అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై రెండో విడత సుంకాలు విధించే యోచనలో ఉన్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతకు ముందు తెలిపారు. ఇప్పటికే ప్రపంచదేశాల పై సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్ తాజాగా మరో దఫా సుంకాలకు సిద్ధం అవుతున్నారు. 

షాంఘై సహకార సమాఖ్య సదస్సు (ఎస్‌సీవో)లో భారత ప్రధాని, రష్యా అధ్యక్షు డు, చైనా అధ్యక్షుడి కలయికకు సంబంధించిన ఫొటోలు ఎలా ఉన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని మీడియా ప్రశ్నించిం ది. ‘రష్యాతో వాణిజ్యం చేసే దేశాలపై సుం కాలు వేయాలనే ట్రంప్ ఆలోచన మంచిదే. మేము రష్యాతో ఎటువంటి వాణిజ్యం చేయడం లేదు. అన్ని రకాల కొనుగోళ్లను నిలిపివేశాం’ అని పేర్కొన్నారు.

ఎస్‌సీవో సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతి న్, భారత ప్రధాని మోదీ కారులో ప్రయాణిస్తూ.. పలు అంశాలపై చర్చించారు. యూ ఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రష్యా నుంచి చము రును కొనుగోలు చేసే దేశాలపై యురోపియన్ యూనియన్, అమెరికా కలిసి మరో దఫా సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నాయి. రష్యాతో వాణిజ్యం ఆపితేనే రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని విరమిస్తారు’ అని పేర్కొన్నారు.