calender_icon.png 12 October, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీ హబ్‌లో ఆకట్టుకున్న ఆటో ఎక్స్ పో

12-10-2025 01:45:06 AM

  1. ఫాస్ట్ అండ్ క్యూరియస్ ది జెన్ జెడ్ ప్రదర్శన 
  2. ప్రారంభించిన నటుడు సాయిదుర్గ తేజ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): యువతలో ఆటోమొబైల్ రంగంపై ఆసక్తి పెంచుతూ, సృజనాత్మకతకు ప్రతీకగా నిలిచేలా స్టూడెంట్ ట్రైబ్ ఆధ్వర్యంలో ఫాస్ట్ అండ్ క్యూరియస్ ది జెన్ జెడ్ ఆటో ఎక్స్ పోకూ నగరంలోని టీ హబ్ వేదికగా ఏర్పాటైంది. ఈ ఎక్స్ పోని టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ శని వారం ప్రారంభించారు.

ది జెన్ జెడ్ ఆటో ఎక్స్ పో విద్యార్థులు, క్రియేటర్లు, ఆటోమొబైల్ అభిమానులకు ఒకే వేదికపై నేర్చుకునే, ఆలోచనలు పంచుకునే, కెరీర్ అవకాశాలను పరిశీలించే ప్రత్యేక అవకాశం కల్పించండం అభినందనీయమని నటుడు సాయి దుర్గ తేజ్ అన్నారు. ఈ సందర్బంగా స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీ చరణ్ లక్కరాజు మాట్లాడుతూ.. “ఈ ఆటో ఎక్స్ పో విద్యార్థులకు ఆటోమొబైల్ రంగంలో ఉన్న కెరీర్ అవకాశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పిస్తుంది.

పరిశ్రమ నిపుణులతో నేరుగా సంభాషిస్తూ, కొత్త ట్రెండ్స్ నేర్చుకునే అద్భుతమైన వేదిక ఇది” అని పేర్కొన్నారు. జెనెక్స్ నిర్వాహకులు అమర్ మాట్లాడుతూ, “ఈ షోలో ఇన్నోవేషన్, ఎనర్జీ, సృజనాత్మకత ప్రతిబింబిస్తున్నాయి. ఓజీ  వంటి ప్రఖ్యాత సినిమాల్లో వాడిన స్పెషల్ కార్లు ఆటోమొబైల్ పరిశ్రమ సినీ ప్రపంచంతో ఎలా మిళితమైందో చూపిస్తున్నాయి” అని తెలిపారు.

రాష్ట్రంలోని 100కిపైగా కళాశాలల నుంచి 2000కు పైగా విద్యార్థులు పాలుపంచుకున్నారు. మారిస్ ఆక్స్ ఫర్డ్ 1951, బ్యూయిక్ 1945, డిసోటో 1946, కాంతారా సినిమాలో ని విన్ టేజ్ కార్లు, భారతదేశపు వేగవంతమైన ఆడి ఆర్8, అలాగే ఓజి సినిమాలో ఉపయోగించిన డాడ్జ్ కింగ్స్వే 1955 వంటి ప్రత్యేక కార్లు గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్ డిజైన్, ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల్లో కెరీర్ అవకాశాలను పరిచయం చేసే వర్క్‌షాప్స్, ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా నిర్వహించారు.