12-10-2025 01:46:14 AM
హాజరైన హెచ్‌ఎండీఏ అధికారులు, సిబ్బంది
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 11 (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం వారోత్సవాన్ని అక్టోబర్ 5 నుంచి 12 వరకు జరుపుకుంటున్న సందర్భంగా శనివారం హైదరాబాదు మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం అమీర్‌పేటలోని కార్యాలయంలో నిర్వహించారు. నిహాంత్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌టీఐ లోతైన, ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. అనంతరం ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు.