02-01-2026 06:26:43 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ నివాస ప్రాంతంలో చేపట్టిన సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని స్థానిక ప్రజలు శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రె ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా సెల్ టవర్ నిర్మాణం చేపట్టడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెల్ టవర్ల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ప్రభావితమవుతారని పేర్కొన్నారు. నివాస ప్రాంతాల్లో కాకుండా, జనసాంద్రత లేని ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ విషయమై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేయడంతో పాటు, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైరాగడే ప్రతాప్, సుగుణాకర్ ,శ్రీనివాసరావు వారణాసి ,పరండే సాయి ,అనంత్,నిమ్మ కంటి కీర్తి ,మసాదే సువర్ణ ,,శిల్పా,పద్మ ,జయంతి ,గాయత్రి కాలనీవాసులు పాల్గొన్నారు.