calender_icon.png 14 November, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేపీఆర్‌ఐటీ డైరెక్టర్ దివ్యశ్రీకి అవార్డు

14-11-2025 01:16:49 AM

ఘట్‌కేసర్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఘట్ కేసర్ మున్సిపల్ ఘనాపూర్ లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్  కొమ్మూరి దివ్యశ్రీ  ఇన్స్టిట్యూషనల్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డును దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సిఎస్‌ఆర్ సమ్మిట్ 2025 లో అందుకున్నారు. ఈ అవార్డు బచ్పన్ బచావో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మిట్‌లో ప్రదానం చేయబడింది.

ఈ గౌరవానికి స్పందిస్తూ కేపీఆర్‌ఈఎస్ చైర్మన్  కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, సెక్రటరీ కొమ్మూరి రాకేష్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. అలాగే డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనాథ్ కాశ్యప్, సీఏఓ జి. నాగరాజు, ఫ్యాకల్టీ సభ్యులు, సిబ్బంది, విద్యార్థులు కూడా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ అవార్డు కేపీఆర్‌ఐటీ విద్యా నాణ్యత, సామాజిక బాధ్యత, ప్రగతిశీల దృష్టిని ప్రతిబింబిస్తుందన్నారు.