14-11-2025 01:15:37 AM
రంగారెడ్డి అదనపు కలెక్టర్ కందుకూరి చంద్రారెడ్డి
కందుకూరు,నవంబర్ 13 ( విజయ క్రాంతి ): రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న గ్రామ పరిపాలన అధికారులు ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కందుకూరి చంద్రారెడ్డి సూచించారు.గురువారం కందుకూరు డివిజన్ పరిధిలోని జిపిఓలకు రెవిన్యూ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఏవరైనా ఆక్రమిస్తే వెంటనే పై అదికారులకు తెల్పి వాటిని స్వాదీనం చేసుకోవాలని తెలిపారు.ప్రస్తుత ప్రభుత్వము రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టడానికి గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతము చేయడానికి గ్రామ పాలన అధికారులను నియమించారని దీనికి తగ్గట్లుగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న గ్రామ పాలన అధికారులకు,కందుకూరు రెవెన్యూ డివిజినల్ అధికారి ఎన్.జగదీశ్వర్ రెడ్డి రెవెన్యూ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ కే.గోపాల్ నాయాబ్ తహశీల్దార్ లు బి.రాజు,కే.శేకర్ తదితరులు పాల్గొన్నారు.