16-08-2025 12:38:01 AM
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- 16 వేల 153 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
- ఖమ్మం జిల్లాలో నూతనంగా 24 వేల 818 కుటుంబాలకు రేషన్ కార్డ్‌లు జారీ
- స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం
ఖమ్మం , ఆగస్టు 15 (విజయ క్రాంతి): ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్ర భుత్వం పాలన కొనసాగిస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలలో డిప్యూటీ సీ ఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. శుక్రవారం ఉదయం ముఖ్య అతిథి పోలీసు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంత రం ముఖ్య అతిథి తన సందేశాన్ని తెలియజేసారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, అహింసే అస్త్రంగా మ హా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసిందని, స్వాతంత్య్రం తరువాత పండిట్ జవ హర్ లాల్ నెహ్రూ సారథ్యంలో అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికామని అన్నారు.70 ఏళ్ళుగా పి.డి.ఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తుందని, అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుం చి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిందని అన్నారు.
పేదల ఆత్మగౌరవానికి మరో ప్రతీక రేషన్ కార్డులను అర్హులైన పేద కు టుంబాలు అందరికీ పంపిణీ చేస్తున్నామని, ఖమ్మం జిల్లాలో నూతనంగా 24 వేల 818 కుటుంబాలకు రేషన్ కార్డ్ లు జారీ చేశామని అన్నారు.రైతు సంక్షేమానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత కల్పించిందని,ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల వరకు రుణ మాఫీ చేసామని అన్నారు. రైతులకు అందించే పెట్టుబడి సహాయాన్ని 12 వేల రూపాయ లకు పెంచి, వానాకాలం పం టకు ఖమ్మం జిల్లాలో 3,37,898 మంది రైతుల ఖాతాలో 427 కోట్ల 38 లక్షల రూ పాయలు రైతు భరోసా నిధులు జమ చేసామని డిప్యూటీ సీఎం అన్నారు.
యాసంగి సీజన్ లో 34 వేల 305 మంది రైతుల వద్ద నుండి రూ.545 కోట్ల విలువ గల 23 లక్షల 60 వేల క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసి 48 గంటలలోగా చెల్లింపులు చేసామని తెలిపారు. మద్దుల పల్లిలో 19 కోట్ల 95 లక్షల రూపాయలు ఖర్చు చేసి నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేశామని, ఖమ్మంలో 155 కోట్లతో మోడల్ మిర్చి మార్కెట్ నిర్మిస్తున్నామని అన్నారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభు త్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశ పెట్టిందని, ఖమ్మం జిల్లాలో 16 వేల 153 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని, ఇంటి నిర్మాణ పురోగతి ప్రకారం నాలుగు దశలలో గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా 5 లక్షల రూపాయలు జమ చేస్తుందని డి ప్యూటీ సీఎం తెలిపారు.
అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన పేదలకు పారదర్శకంగా అందజేస్తున్నామని అన్నారు. ఆడబిడ్డలు ఆనం దంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుందనీ, మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, నేటి వరకు జిల్లా వ్యాప్తంగా మహిళలు 4 కోట్ల 22 లక్షల 98 వేల 507 ఉచిత బస్సు ప్రయాణాలు చేయడం వల్ల 198 కోట్ల 34 లక్షల 49 వేల రూపాయలను ఆదా చేశారని అన్నారు.మహాలక్ష్మి పథకం క్రింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని, దీని ద్వారా జిల్లాలో 2 లక్షల 29 వేల 34 కుటుంబాలు లబ్ది పొందినట్లు తెలిపారు.
గృహ జ్యోతి పథకం క్రింద జిల్లాలో 150 కోట్ల రూపాయల సబ్సీడి చెల్లించి 2 లక్షల 48 వేల 995 కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెం ట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, వైరా ఎ మ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ ప్రసాదరావు, డి.ఆర్.ఓ. ఏ. పద్మ శ్రీ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రా వు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 15, (విజయ క్రాంతి) మన దేశ పాలన నుంచి విముక్తి చేసి, స్వేచ్ఛాయుత వాతావరణ సా ధనకు జరిపిన స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానుయులు తమ ప్రాణాలను తృణప్రాయం చేశారు. వారి ఆశయ స్ఫూర్తి ని ఆశయంగా చేసుకొని ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చే స్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతున్న ట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ప్రగతి మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితే ష్ వి పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనే ప్రసంగించారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాలో ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షే మ పథకాల ప్రగతి నివేదికను ప్రజలకు చది వి వినిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో జిల్లా సమగ్ర అభివృద్ధికి చేపట్టిన పథకాలు ఇలా కొనసాగు తున్నాయి.
వ్యవసాయ శాఖ :
దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తనదైన ముద్ర వేస్తు న్నాం. సాగునీటి ప్రాజెక్టులు రైతు భరోసా రైతు భీమా రుణమాఫీ పథకాలతో రైతు రా జ్యంగా మార్చాం.1, 78,380 మంది రైతులకు రూ318.69 కోట్లు రైతు భరోసా పథకంలో రైతుఖాతాల్లో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్నారు. రైతు బీమా లో వార్షిక ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తూ 1,08,223 మంది రైతులకు భీమా చేశామ ని, మరణించిన 698 మంది రైతులకు రూ 5 లక్షల చొప్పున,రూ.34.90 కోట్లు ఆర్థిక సహాయం అందించామన్నారు. రైతు రుణమాఫీ పథకంలో 63,614 మంది రైతులకు రూ.455.33 కోట్లు మూడు విడతల్లో రుణమాఫీ చేశామన్నారు.
ఉద్యానవన శాఖ ః
ఆయిల్ ఫామ్, కోకో సాగులో యావత్ తెలంగాణకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హ బ్బుగా మారిందన్నారు. జిల్లాలో 75,920 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగులో ఉంది. డ్రిప్ ఇరిగేషన్ లో ఎస్సీ ,ఎస్టీ రైతులకు నోరు శాతం బిసి, ఇతర రైతులకు 90 శాతం సేద్య పరికరా లపై రాయితీ అందించడం జరిగిందన్నారు.
మార్కెటింగ్ శాఖ :
జిల్లాలో ఆరు వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 34 650 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 19 గోదాములు నిర్మించామన్నారు. లక్ష్మీదేవి పల్లె మార్కెట్లో పత్తి మిరప, కందులు, జొన్నలు, పెసర్లు కొనుగోలు చే యడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేశామన్నారు.
పౌరసరఫరాల శాఖ :
జిల్లాలో 2,76,057 ఆహార భద్రతా కార్డులు,21,128 అంత్యోదయ కార్డుల ద్వా రా 9,03,766 మందు లబ్ధి పొందుతున్నారన్నారు. జిల్లాలో 167 దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని, మహాలక్ష్మి పథకంలో రూ 500 కే గ్యాస్ ను 1,54,633 మంది లబ్ధిదారులకు 6,31,875 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు.
భూ భారతి చట్టం:
బో రికార్డులు పారదర్శకంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా భూభారత చట్టం అమలు చేశామన్నారు. జిల్లాలో రెవెన్యూ సదస్సుల ద్వారా 78, 278 దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టామన్నారు.
ఇందిరమ్మ ఇల్లు :
పేదల ఆత్మగౌరవంతో జీవించేలా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 20,282 ఇల్లు లబ్ధిదారులకు అందజేసినట్టు తెలిపారు. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జిల్లాని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నట్టు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగస్తులకు అవార్డులను పంపిణీ చేశారు.