14-08-2025 06:47:04 PM
బీజేపీ దుండిగల్ పురపాలక ఆధ్వర్యంలో ఘనంగా త్రివర్ణ పతాక ర్యాలీ..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ప్రతి భారతీయుని గుండెల్లో దేశభక్తి నిండి ఉండాలని బీజేపీ దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి(BJP Dundigal Municipality President Peesari Krishna Reddy) పేర్కొన్నారు. 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు బీజేపీ దుండిగల్ మున్సిపాలిటీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గండిమైసమ్మ చౌరస్తాలో త్రివర్ణ పతాక ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, యువత మత్తుకు, మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా వాటికి దూరంగా ఉంటూ అణువణువూ దేశభక్తి నిండి ఉండాలని సూచించారు. దేశంలో ఎప్పుడు ఎలాంటి విపత్తు వచ్చిన నేను సైతం దేశం కోసం అనే నినాదంతో ముందుకు నడవాలని కోరారు.
సరిహద్దులో సైనికులు, గ్రామాల్లో రైతులు దేశం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని భారతజాతి ఐక్యత చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. విగ్నేశ్వర్ చారి, జిల్లా ఉపాధ్యక్షురాలు భౌరంపేట్ మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ, రాష్ట్ర ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షులు డి. శ్యామ్ రావ్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గోనె మల్లారెడ్డి, ఉపాధ్యక్షలు నల్ల రామచంద్రా రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబెర్ ఏ. మల్లేష్ యాదవ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శులు తురాయి భాను గౌడ్, దమ్మగారి సీతారాంరెడ్డి, కార్యదర్శి ఎస్. లత,సీనియర్ బీజేపీ నాయకులు డి. ప్రభాకర్ రెడ్డి, ఏ. శ్రీనివాస్ యాదవ్,వై. జంగారెడ్డి,జి. మోహన్ రెడ్డి,శ్రీనివాస్,యువమోర్చ నాయకులు ఆకుల విజయ్, ఆకుల యశ్వంత్,నవీన్,చిన్న ముదిరాజ్, పోలింగ్ బూత్ అధ్యక్షులు అందె అశోక్,పి. మాధవరెడ్డి, గుడ్ల జగదీశ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.