14-08-2025 06:31:21 PM
తహసీల్దార్ కు బీఆర్ఎస్ నేతల వినతి..
అదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో నూతనంగా ఏర్పడిన బోరజ్ మండలంలోని గూడ, హత్తిఘట్ గ్రామ శివారులోని పలు భూముల అక్రమంగా రిజిస్ట్రేషన్ లను అడ్డుకోవాలని మండల బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు తహసిల్దార్ రాజేశ్వరీ(Tehsildar Rajeshwari)ని గురువారం కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమిలపై విచారణ చేసి ప్రభుత్వ భూములను పరిరక్షించాలన్నారు. హత్తిఘట్ శివారులోని 41,41/2 అక్రమ రిజిస్ట్రేషన్ పైన ఎంక్వైరీ చేసి అది ప్రభుత్వ భూమి లేక, ప్రైవేటు భూమి నా విచారణ చేసి, ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. అలాగే గౌరీ శంకర్ భూముల వివరాలు సేకరించి ప్రజలు మోసపోకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ పురుషోత్తం యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ విజయ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రభాకర్, వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఉషన్న, బట్టు సతీష్, మాజీ ఎంపీటీసీ లు మహేందర్, కొల భోజన్న తదితరులు పాల్గొన్నారు.